Dheemthana Dheemthana
1
views
Lyrics
ధీంతానా ధీంతానా ఇది మనసు పండగని అనుకోనా ధీంతానా ధీంతానా కల ఎదుట వాలినది నిజమేనా ధీంతానా ధీంతానా ఇది మనసు పండగని అనుకోనా ధీంతానా ధీంతానా కల ఎదుట వాలినది నిజమేనా కను రెప్పల కోలాటమిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నులి వెచ్చగ బాగుందిది హే నిన్నింక వదలనులే నీ చెయ్యి విడువనులే నీలోంచి కదలనులే ధీంతానా ధీంతానా ఇది మనసు పండగని అనుకోనా ధీంతానా ధీంతానా కల ఎదుట వాలినది నిజమేనా ♪ పాల సంద్రంలా పొంగిపోతున్నా పాల పుంతల్లో తేలిపోతున్నా విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్నా కురిసే తారలన్నీ దోసిళ్ళలో నింపేస్తున్నా చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్నా కొత్త జన్మేదో అందుకుంటున్నా రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్నా నింగి అంచుమీద రంగు రంగు చేపలాగ గెంతుతున్న ఓ ధీంతానా ధీంతానా ఇది మనసు పండగని అనుకోనా ధీంతానా ధీంతానా కల ఎదుట వాలినది నిజమేనా ♪ ఇంత కాలంగా ఎక్కడున్నావే ఉన్న పలంగా ఊడిపడ్డావే తెలిసీ తెలియనట్టు నా మనసునే లాగేసావే అసలేం ఎరగనట్టు నీ వెనకనే తిప్పించావే నిన్ను చూశాకే ప్రాణమొచ్చిందే వింత లోకంలో కాలు పెట్టిందే నిన్ను తాకుతున్న గాలి వచ్చి నా చెంప గిల్లుతుంటే అంతకన్నా హాయి ఉండదే అరె నిన్ను తప్ప కన్ను ఇంక నన్ను కూడా చూడనందే ఓ ధీంతానా ధీంతానా ఇది మనసు పండగని అనుకోనా ధీంతానా ధీంతానా కల ఎదుట వాలినది నిజమేనా కను రెప్పల కోలాటమిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నులి వెచ్చగ బాగుందిది హే నిన్నింక వదలనులే నీ చెయ్యి విడువనులే నీలోంచి కదలనులే
Audio Features
Song Details
- Duration
- 04:26
- Key
- 8
- Tempo
- 89 BPM