Inthaku Nuvvevaru
1
views
Lyrics
Who who who, who are you? Who who who, who are you? ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఇంతకు ముందెవరు, ఇంతగా నాకెవరు చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు నీ పంతము ఏమిటని, ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ కలిశావు తియ్యనైన వేళ చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాల ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ పేరే ఆశ రేపే నాలో నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూశాలే నన్ను నేను నీలో ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ ఇంతకు నువ్వెవరు, వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఒక నిమిషం కోపముతో, మరు నిమిషం నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు నీ పంతము ఏమిటని, ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు
Audio Features
Song Details
- Duration
- 04:42
- Key
- 7
- Tempo
- 174 BPM