Koppamga Koppamga - From "Mr. Majnu"

1 views

Lyrics

కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
 చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
 దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
 నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా
 పారు కోసం bar-uకి వెళ్ళి దాసుడినవ్వనుగా
 తప్పే నాది నొప్పెంతున్నా నిను మెప్పిస్తాగా
 లైలా కోసం మజ్ను మల్లే కవిలా మిగలనుగా
 పిల్లా నువ్వే ఎక్కడ ఉన్నా వెంటే వస్తాగా
 ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
 రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
 ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
 రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
 కోపంగా కోపంగా చూడొద్దే కారంగా
 చీటికి మాటికి తిట్టకే తియ్యంగా
 దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా
 నీ అల్లరి అడుగుల సరిగమ విన్నాగా
 ♪
 విరబూసిన కొమ్మలు తట్టి
 ఏవే నీ పువ్వులు అంటే
 టక్కున దాచి లేవని చెబుతాయా
 నిజమైన కలలను పట్టి
 కనుపాపల వెనకకు నెట్టి
 దాచేస్తే అవి కలలైపోతాయా
 చెరిపేస్తే చెరగని ప్రేమకథ
 నాకంటే నీకే బాగా తెలుసు కదా
 ఆపేస్తే ఆగిపోని చిలిపికథ
 ఏ నిమిషం మొదలవుతుందో తెలుపదుగా
 మనసా
 ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూమి అలకే పూనిందా
 నువ్వొద్దు నీ వెలుగొద్దు అంటూ గొడవే చేసిందా
 ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
 రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
 ఎగరేశా మనసే నీకై తెల్లని మబ్బులా
 రాసేశా ప్రేమను నీకే రంగుల కవితలా
 

Audio Features

Song Details

Duration
04:34
Key
1
Tempo
101 BPM

Share

More Songs by Thaman S

Albums by Thaman S

Similar Songs