Vellipoke

3 views

Lyrics

వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి
 వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడకా
 వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి
 వెళ్ళిపొవే వెళ్ళిపోవే మళ్ళీ రాకికా
 నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు
 దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్లిపోవే
 మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు
 కట్టగట్టి మంటలోన వేసిపోవే
 అటు వైపో ఇటు వైపో
 ఎటు ఎటు అడుగులు వెయ్యాలో
 తెలియని ఈ తికమకలో తోసేసావేంటే, ప్రేమ
 నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా
 నా లాగా ఏనాడూ నువ్వనుకోలేదా, ప్రేమ
 ♪
 వెళ్ళిపోకే
 వెళ్ళిపోకే
 ♪
 ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను
 కన్న కలలన్ని కాలిపోతుంటె ప్రాణం ఉంటదా
 చెలి చిటికెడంతైన జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ
 అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా
 తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే
 కన్నుల్లో కన్నీటి వరదై పోయావే ప్రేమ
 మనసెపుడూ ఇంతేలే ఇచ్చేదాకా ఆగదులే
 ఇచ్చాక ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ
 వెళ్ళిపోకే
 వెళ్ళిపోకే
 ♪
 వెయ్యి జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచిపోలేను
 ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమ ఏంటిలా
 కనుపాపలో ఉన్న కాంతి రేఖ చీకటయ్యింది నువ్వు లేక
 వెలుతురేది దరికి రాదే వెలితిగా ఉంది చాలా
 జత నువ్వే గతి నువ్వే అనుకోటం నా పొరపాటా
 చెలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమ
 అటు నువ్వు ఇటు నేను కంచికి చేరని కథ లాగా
 అయిపోతే అది చూస్తూ ఇంకా బ్రతకాలా, ప్రేమ
 

Audio Features

Song Details

Duration
04:37
Key
4
Tempo
92 BPM

Share

More Songs by Ranjith Govind

Similar Songs