Sye Raa
1
views
Lyrics
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా (హో సైరా... హో సైరా... హో సైరా) ఉషస్సు నీకు ఊపిరాయెరా (హో సైరా... హో సైరా... హో సైరా) యషస్సు నీకు రూపమాయెరా అహంకరించు ఆంగ్ల దొరలపైన హుంకరించగలుగు ధైర్యమా తలొంచి బతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే... తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా ప్రపంచమొణికిపోవు పెనుతుఫానులాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి పెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది (హో సైరా... హో సైరా... హో సైరా) ఉషస్సు నీకు ఊపిరాయెరా (హో సైరా... హో సైరా... హో సైరా) యషస్సు నీకు రూపమాయెరా దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం అణిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం ఓ... నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం కదనరంగమంతా (కదనరంగమంతా) కొదమసింగమల్లె (కొదమసింగమల్లె) ఆక్రమించి (ఆక్రమించి) విక్రమించి (విక్రమించి) తరుముతోందిరా అరివీర సంహారా (హో సైరా... హో సైరా... హో సైరా... హో సైరా... హో సైరా) ఉషస్సు నీకు ఊపిరాయెరా
Audio Features
Song Details
- Duration
- 05:28
- Key
- 11
- Tempo
- 130 BPM