Kannu Theristhe Jananamele

3 views

Lyrics

కన్నుతెరిస్తే జననమేలే కన్నుమూస్తే మరణమేలే
 ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే
 Hey hey కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే
 ఎన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది తెలియదులే
 తీరం అడ్డని అలలకు తెలిసే
 నిత్యం ఆగక తన్నుకు ఎగసే
 పయనం తప్పని గమ్యం మనదే
 అన్నీ వదిలి ముందుకు నడిచెయ్
 నువ్వేకాదు ఏ మనిషైనా అద్దంలోకి చూసే క్షణాన
 ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా
 కన్నుతెరిస్తే జననమేలే కన్నుమూస్తే మరణమేలే
 ఈ రెప్పపాటులో జీవితమంతా సాగునులే
 Hey hey కాలమంతా వెతకగల శక్తి నీలో ఉన్నసరే
 ఎన్నో ఉన్నా నువ్వెవ్వరన్నది తెలియదులే
 నిన్న అన్నది నిన్నే అంతం రేపు అన్నది ఎవరికి సొంతం
 నేడు అన్నదే ఉన్న ఊపిరి ఇపుడే ఇకడే అంది నిజం
 స్వర్గమన్నది మనిషికి మోహం నరకమన్నది భయమనే రోగం
 మనకు నచ్చితే చేయవలెనని మనసే నేర్పిన ఒక సూత్రం
 అడుగులు చెదిరినా ప్రళయమొచ్చినా ఆపకు యుద్ధం అన్నది శాస్త్రం
 ఫలితం ఎంచకు కార్యం మరువకు అన్నది వేదం
 తీరం అడ్డని అలలకు తెలిసే
 నిత్యం ఆగక తన్నుకు ఎగసే
 పయనం తప్పని గమ్యం మనదే
 అన్నీ వదిలి ముందుకు నడిచెయ్
 నువ్వేకాదు ఏ మనిషైనా అద్దంలోకి చూసే క్షణాన
 ఆ ప్రతిరూపం అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా

Audio Features

Song Details

Duration
03:56
Key
4
Tempo
92 BPM

Share

More Songs by Achu

Albums by Achu

Similar Songs