Bujji Bangaram

4 views

Lyrics

కలలో కూడా కష్టం కదే ఈ హాయి
 కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి
 వదలకుండ పట్టుకుంటా నీ చెయ్యి
 నువ్వట్టా నచ్చేశావోయ్ అబ్బాయి
 నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా
 నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
 నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా
 పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా
 తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం
 నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం
 ♪
 సొంత ఊరిలో కళ్ల ముందరే కొత్త దారులెన్నో పుట్టాయే
 అంతేలేరా జంటగుంటే అంతేలేరా
 సొంతవారితో ఉన్న నిన్నలే గుర్తురాము పొమ్మనన్నాయే
 జతలో పడితే జరిగే జాదూ ఇదేగా
 ముద్దులెన్నో పెట్టాలిగా, పెట్టి గాల్లో పంపాలిగా
 ఊపిరంతా గంధమైపోయేంతగా
 ముందుకొచ్చే ఉన్నానుగా ఎందుకమ్మా ఇంకా దగా
 నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా
 తప్పదింక భరించరా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
 నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం
 ♪
 నిన్ను తాకితే ఒక్కసారిగా పట్టుకుంది నన్ను అదృష్టం
 చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
 ఉన్న జన్మనీ ముందు జన్మనీ చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
 అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే
 ఎన్నో ఎన్నో అన్నారులే, ఎన్నో ఎన్నో విన్నాములే
 వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
 సర్లే సర్లే చెప్పావులే సందు సందు తిప్పావులే
 వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే
 తప్పదింక భరించనా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
 నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
 నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం
 

Audio Features

Song Details

Duration
03:28
Key
3
Tempo
120 BPM

Share

More Songs by Nakash Aziz

Albums by Nakash Aziz

Similar Songs