Jo Achyutananda
9
views
Lyrics
జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా జో జో జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా జో జో ♪ అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార జో జో ♪ గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి కవరమ్మున నున్న కంసుపడగొట్టి గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి కవరమ్మున నున్న కంసుపడగొట్టి నీవు మధురాపురము నేల చేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి జో జో ♪ హంగుగా తాళ్లపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పె నీ జోల హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పె నీ జోల సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల జో జో జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా జో జో జో జో జో జో
Audio Features
Song Details
- Duration
- 07:41
- Key
- 1
- Tempo
- 148 BPM