O Manmadhuda

2 views

Lyrics

చూపు చాలు ఓ మన్మధుడా
 ఆగనంది నా గుండె దడ
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 మాట చాలు ఓ మాళవిక
 ఆగలేదు నా ప్రాణమిక
 తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
 కలుపుకోవా నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా
 కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
 చూపు చాలు ఓ మన్మధుడా
 ఆగనంది నా గుండె దడ
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 ♪
 ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిది వయసేనా
 తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
 నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా
 అందమైన అద్భుతాన్నిలా దరికి పిలుచుకోనా... హే
 ఆడించు నన్ను, పాడించు నన్ను నీ హాయి నీడలో
 తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
 చూపు చాలు ఓ మన్మధుడా
 ఆగనంది నా గుండె దడ
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 ♪
 ఆడ మనసులో అభిలాష అచ్చ తెలుగులో చదివేసా
 అదుపు దాటి వరదయింది ఈ చిలిపి చినుకు వరస ...హే
 నన్ను నేను నీకొదిలేసా ఆదమరపులో అడుగేసా
 అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా
 అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా
 తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
 చూపు చాలు ఓ మన్మధుడా
 ఆగనంది నా గుండె దడ
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 తెలుసుకో సుందరా నా మనసులో తొందర
 

Audio Features

Song Details

Duration
04:43
Tempo
126 BPM

Share

More Songs by Sagar

Similar Songs