Cheliya

1 views

Lyrics

చెలియ చెలియా చిరుకోపమా
 చాలయ్యా చాలయ్యా పరిహాసము
 కోపాలు తాపాలు మనకేల
 సరదాగా కాలాన్ని గడపాల
 సలహాలు కలహాలు మనకేల
 ప్రేమంటే పదిలంగా ఉండాల
 చెలియ చెలియా చిరుకోపమా
 చాలయ్యా చాలయ్యా పరిహాసము
 రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే
 గాలి తాకంగ పూచెనులే
 అయితే గాలే గెలిచిందననా
 లేక పువ్వే ఓడిందననా
 రాళ్ళల్లో శిల్పం లోలోపల దాగున్నా
 ఉలి తాకంగ వెలిసెనులే
 అయితే ఉలియే గెలిచిందననా
 లేక శిల్పం ఓడిందననా
 ఈ వివరం తెలిపేది ఎవరంట
 వ్యవహారం తీర్చేది ఎవరంట
 కళ్ళల్లో కదిలేటి కలలంట
 ఊహల్లో ఊగేటి ఊసంట
 చెలియ చెలియా చిరుకోపమా
 నీలిమేఘాలు చిరుగాలిని ఢీకొంటే
 మబ్బు వానల్లే మారునులే
 దీన్ని గొడవే అనుకోమననా
 లేక నైజం అనుకోనా
 మౌనరాగాలు రెండుకళ్ళను ఢీకొంటే
 ప్రేమ వాగల్లే పొంగునులే
 దీన్ని ప్రళయం అనుకోమననా
 లేక ప్రణయం అనుకోనా
 ఈ వివరం తెలిపేది ఎవరంట
 వ్యవహారం తీర్చేది ఎవరంట
 అధరాలు చెప్పేటి కథలంట
 హృదయంలో మెదిలేటి వలపంట
 చెలియ చెలియా చిరుకోపమా
 చాలయ్యా చాలయ్యా పరిహాసము
 

Audio Features

Song Details

Duration
05:40
Key
4
Tempo
101 BPM

Share

More Songs by Srinivas

Albums by Srinivas

Similar Songs