Aa Gagananney
3
views
Lyrics
ఆ గగనాన్నే దించరా ఏ విధి ఎదురైనా ఈ శిఖరం తల వంచదా నీ గమ్యంలోన (నడిచే దిశలో పిడుగే పడనీరా వెనకడుగెయ్యకురా) (కలతే పడితే కలలే కల్లలేరా మెరుగలు పంచేయరా) రాజు పేద భేదాలన్నీ ఈ రాజ్యంలో ఇకపై రానే రావు ఊరు వాడ ఉప్పెనల్లే ముందడుగు వేస్తే వ్యధలే రావు అదిగో ఉదయం, పిలిచే హృదయం లేనే లేదిక ఖేదం ప్రేమే మనకిక వేదం (పచ్చని చివురులు తొడిగే ప్రతి పైరు, పేదల దరహాసం) (అదిగో అచటే కనరే కొలువయ్యే దేవుని ప్రతిరూపం) సత్యం ఉంది, ధర్మం ఉంది సర్వం ఉన్న మహిలో కొరతేముంది కక్షలు కట్టే శత్రువునైనా ప్రేమించేస్తే మమతే కొలువౌతుంది సమరం విడిచి, సమతే విరిసే మార్గం ఇక నీ లక్ష్యం శౌర్యం, జ్ఞానమే సాక్ష్యం (మదిలో ఎదిగే మృగమే చావాలి, చెలిమితో బ్రతకాలి) (జనతే మురిసే జగమే కావాలి, శాంతిని నిలపాలి) ఆ గగనాన్నే దించరా ఏ విధి ఎదురైనా ఈ శిఖరం తల వంచదా నీ గమ్యంలోన (నడిచే దిశలో పిడుగే పడనీరా వెనకడుగెయ్యకురా) (కలతే పడితే కలలే కల్లలేరా మెరుగలు పంచేయరా)
Audio Features
Song Details
- Duration
- 04:57
- Key
- 9
- Tempo
- 124 BPM