Andagaada

3 views

Lyrics

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
 అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
 మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
 పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
 గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
 నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
 ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
 అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
 అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
 గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
 నా అందం చందం అంతా నీకోసం
 తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
 నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
 ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
 ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
 అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
 అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
 జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం
 ఏనాడూ లేనేలేదు ఈ మైకం
 నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం
 గుర్తంటూ రానేరాదు ఈ లోకం
 నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
 రాగమై సాగెనే అంతులేని ఆనందం
 మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
 పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
 గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
 నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
 ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
 

Audio Features

Song Details

Duration
05:20
Key
11
Tempo
170 BPM

Share

More Songs by Harini

Similar Songs