Rangule

3 views

Lyrics

నా కళ్ళలో కొత్త నీలిరంగు పొంగెనే
 అవి నిన్ను చూసినప్పుడే
 నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
 నువ్వు నన్ను చూసినప్పుడే
 నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది
 నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసింది
 రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 కన్ను చూడనన్ని కొత్త రంగులే
 ♪
 ఓ నవ్వు నువ్వు విసిరావు ఆ క్షణం రంగు
 (తెలుపు)
 నా కాటుకిష్టం అన్నావు ఆ పూట రంగు
 (నలుపు)
 నీ చేతి స్పర్శే తాకిందో నా ఒంటి రంగు
 (చెంగావి)
 నీ మౌనమే ఓ ముళ్ళైతే నా పలుకు రంగు
 (గులాబి)
 జగమాడే రంగేళి ఏడాదికోసారి
 నాలో ఈ హొళిలే నిమిషానికోసారి నీ వల్లే
 రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 కన్ను చూడనన్ని కొత్త రంగులే
 ♪
 నువ్వు పలకరించే ప్రతిసారీ నా పులకరింతది ఏ రంగు
 నీ మెప్పు పొందే ప్రతిసారీ నా గొప్పతనమది ఏ రంగో?
 నువ్వు కోపగించి సమయంలో నా బుజ్జగింపుది ఏ రంగో?
 నువ్వు విడిచి వెళ్ళే వేళల్లో నా ఏదన వేదనదేరంగో?
 హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే
 నా మనసే నీ వల్లే వేవేలా రంగుల్ని వెదజల్లే
 రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే రంగులే పేరు లేనివెన్నో కొత్త రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 నువ్వు పక్కనుంటే రంగులే
 రంగులే (రంగులే)
 రంగులే (రంగులే)
 పేరు లేనివెన్నో కొత్త రంగులే
 

Audio Features

Song Details

Duration
04:17
Key
7
Tempo
92 BPM

Share

More Songs by Shweta Mohan

Similar Songs